ఈ ఫుడ్ కాంబినేషన్స్ ..
మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం..
అరటి పండు తిన్న వెంటనే పాలు తాగకూడదు. ఆయుర్వేదం ప్రకారం అరటి పళ్లు, పాలు కలిపి తీసుకుంటే జలుబు, అలెర్జీలు మొదలవుతాయి.
మద్యం సేవించిన వెంటనే షుగర్ మాత్రలు, పెయిన్ కిల్లర్స్, యాంటీ-డిప్రసెంట్స్ వేసుకుంటే ప్రమాదకరం.
నిమ్మ, బత్తాయి, జామ వంటి ఎసిడిక్ నేచర్ గల ఫలాలను తిన్న వెంటనే పాలు తాగితే అరగవు. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం మొదలవుతాయి.
ఎనర్జీ డ్రింక్స్‌లో ఆల్కహాల్‌ను కలపకూడదు. ఈ రెండు కలిపి తాగితే షుగర్ లెవెల్స్ పెరిగిపోయి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
పాలు, పెరుగు, మజ్జిగ వంటి డెయిరీ ప్రోడక్ట్స్‌ను తీసుకున్న వెంటనే టెట్రా సైక్లిన్, సిప్రోఫ్లాక్సిన్ వంటి యాంటీ-బయాటిక్ మాత్రలను వేసుకోకూడదు.
ఛీజ్ ఉన్న ఆహారం తిన్న వెంటనే కూల్ డ్రింక్స్‌లు అసలు తీసుకోకూడదు. ఆ రెండు కలిసి మీ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి.
చేపలు తిన్న వెంటనే పాలు తాగకూడదు. అలా చేయడం వల్ల కడుపులో టాక్సిన్స్ ఫామ్ అవుతాయి.
చిక్కుళ్లు, ఛీజ్ కలిపి వండకూడదు. ఈ రెండు కలవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణ సంబంధ సమస్యలను కలిగిస్తాయి.
నేతి పదార్థాలు తిన్న వెంటనే, తేనెను తీసుకోకూడదు. ఈ రెండు కలవడం వల్ల శరీరంలో హానికర సమ్మేళనాలు ఏర్పడతాయి.
Related Web Stories
వినాయక చవితి శోభ
ఈ ఆహార పదార్థాలతో పురుషులు స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు
ఇంట్లో గణపతి పూజ ఎలా చేయాలి... పూజకు సామగ్రి ఏమిటంటే..?
అన్నం వండి గంజి నీళ్లు పడేస్తున్నారా? ఈ నిజాలు తెలిస్తే..!