వావ్.. రాత్రి త్వరగా భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?
ప్రస్తుతం రాత్రి భోజనం అనేది రోజులో చివరి పనిగా మారుతోంది. దాని వల్ల చాలా అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. నిద్రకు రెండు, మూడు గంటల ముందు భోజనం చేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
చీకటి పడుతున్న కొద్దీ జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది. రాత్రి 7-8 గంటలకల్లా భోజనం చేస్తే తిన్నది చక్కగా అరుగుతుంది. లేట్ అయితే పోషకాహారం తిన్నా ఉపయోగం ఉండదు.
తిన్నది అరిగిపోతే చక్కగా నిద్ర పడుతుంది. నిద్రకు రెండు గంటల ముందు భోజనం చేయడం ఉత్తమం.
రాత్రి భోజనం త్వరగా చేస్తే క్యాలరీలను బర్న్ చేయడానికి సమయం దొరుకుతుంది. తిన్న వెంటనే నిద్రపోతే బరువు పెరగడం ఖాయం.
షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఎంత త్వరగా భోజనం చేస్తే అంత మంచిది. రాత్రంతా రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉంటాయి.
తిన్న పోషకాలు శోషణం కావడానికి తగినంత సమయం ఇస్తే, నిద్ర సమయంలో శరీరం తనను తాను రిపేర్ చేసుకోవడానికి తగినంత శక్తి లభిస్తుంది.
త్వరగా భోజనం చేయడం వల్ల గుండె మంట, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు దరి చేరవు. మనం నిద్రపోయాక కూడా మన జీర్ణ వ్యవస్థ పని చేయాల్సిన అవసరం ఉండదు.
రాత్రి భోజనం ద్వారా తీసుకున్న ప్రోటీన్లు, విటమిన్లను శరీరం శోషణం చేసుకోవాలంటే తగినంత సమయం మనం మేల్కొని ఉండాలి.
నిద్రకు రెండు గంటల ముందు భోజనం చేయడం వల్ల మెటబాలిజమ్ మెరుగుపడుతుంది. నిద్ర సమయానికి మన కడుపు ఖాళీ అవుతుంది.
మన శరీరంలో అతి ముఖ్యమైన పనులు చేసే ఇన్సులిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు తగినంత ఉత్పత్తి కావాలంటే రాత్రి భోజనం త్వరగా ముగించాలి.