నిత్యం తినే అరటి పళ్ల గురించి పెద్దగా ఆలోచించం కానీ వీటితో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే అరటిని అత్యంత ఆరోగ్యవంతమైన పండని నిపుణులు చెబుతారు.

విటమిన్ సీ, విటమిన్ బీ6, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, పీచుపదార్థం, వంటివన్నీ ఉండే అరటి ఓ సమతుల ఆహారం

ఇందులో చక్కెర అధికంగా ఉండటంతో తిన్న వెంటనే శక్తిని ఇస్తుంది. ఎక్సర్‌సైజులు చేశాక ఇది తింటే మంచి ఫలితం ఉంటుంది.

పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది సులువుగా అరగిపోతుంది. పేగులకు ఇది మంచిది. దీంతో మలబద్ధకం దరిచేరదు.

పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువగా ఉన్న అరటి రక్తపోటును నియంత్రించి గుండెకు మేలు చేస్తుంది

ట్రిప్టోఫాన్ అమైనోయాసిడ్ అరటిలో ఎక్కువ. భావోద్వేగాలను నియంత్రించే సెరటోనిన్ ఉత్పత్తికి ఇది కీలకం. కాబట్టి అరటితో మూడ్ మెరుగవుతుంది

ఎక్సర్‌సైజుల తరువాత అరటి తింటే కండరాల్లోని చెక్కర నిల్వలు త్వరగా పెరుగుతాయి. కాబట్టి భారీ కసరత్తుల తరువాత అరటి తినాలి. 

అరటిలో ఉండే విటమిన్ సీ, ఇతర యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్ల బెడద తగ్గుతుంది.