ఆరోగ్యాన్ని పెంచే మునగాకు రైస్..  చాలా రుచిగా ఇలా చేసేయండి..

ముందుగా పాన్ లో నూనె వేడి చేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలుచింతపండు వేసి ఒక నిమిషం వేయించాలి. 

 తరువాత శనగపప్పు, మినపప్పు, మిరియాలు, జీలకర్ర, దనియాలు, నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి.

దోరగా వేగిన దినుసులలో మునగ ఆకులు కూడా వేసి ఆకులు పచ్చిదనం పోయేవరకు వేగించాలి. 

తరువాత ఇందులో ఉప్పు వేసి చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.

స్టవ్‌ మీద కడాయి పెట్టి అందులో టేబుల్ స్పూన్ నూనె వేసి ఆవాలు, వేరుశనగ, జీడిపప్పు వేసి వేయించాలి. 

 అందులోనే పోపు దినుసులు అన్నీ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

పోపులో రెండు కప్పుల  అన్నం వేసి కలపాలి.

 ఇందులో తయారు చేసుకున్న మునగ ఆకుల పొడి రెండు నుండి మూడు స్పూన్లు వేసి బాగా కలపాలి.

 ఉప్పు సరిచూసుకుని తక్కువైతే ఉప్పు జోడించాలి. 

ఇలా చేస్తే ఎంతో రుచికరంగా ఉండే మునగాకుల రైస్ సర్వ్ చేయడానికి సిద్దం.