దసరా సెలవుల సందర్భంగా హైదరాబాద్ వాసులు బీచ్‌కు వెళ్లాలనుకుంటున్నారా..?

అయితే హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న ఈ ప్రాంతాల గురించి మీకు తెలుసా..

హైదరాబాద్‌కు దాదాపు 620 కి.మీ. దూరంలో విశాఖపట్నం రిషికొండ బీచ్ ఉంది.

ఈ బీచ్‌లో బంగారు రంగు ఇసుక, స్వచ్ఛమైన నీరు, కొండలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

విండ్‌ సర్ఫింగ్, జెట్ స్కీయింగ్, స్విమ్మింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్‌ను ఇష్టపడే వారికి బెస్ట్ స్పాట్.

వైజాగ్ నుంచి 15కి.మీ.ల దూరంలో ఉన్న యారాడా బీచ్‌లో ప్రశాంత వాతావరణం ఉంటుంది.

ప్రకృతి అందాలు, కొండలు ప్రత్యేక ఆకర్షణ. రద్దీ ఎక్కువగా ఉండదు. పిక్నిక్‌లకు మంచి స్పాట్.

విశాఖపట్నం నుంచి భీమిలి బీచ్ 24 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ బీచ్‌లో రద్దీ తక్కువ.

ప్రైవసీ కావాలనుకునే వారికి బెస్ట్ ప్లేస్. డచ్, బ్రిటిష్ వలసదారుల చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి.

గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ హైదరాబాద్‌కు దగ్గరగా ఉంటుంది.

భాగ్యనగరానికి 350 కి.మీ. దూరంలో ఉండటం వల్ల వారాంతంలో ఇక్కడకు వెళ్లొచ్చు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ హైదరాబాద్‌కు 340 కి.మీ.ల దూరంలో ఉంది.

మునిగిపోతామనే భయం లేకుండా ఇక్కడ ఈత కొట్టడానికి అవకాశం ఉంది.

హైదరాబాద్‌కు 340 కి.మీ.ల దూరంలో ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో ఓడరేవు బీచ్ ఉంది.

సికింద్రాబాద్ నుంచి తిరుపతి రైలు ఎక్కి చీరాలకు రావాలి. అక్కడ్నుంచి బస్సులో ఇక్కడికి రావొచ్చు.