గొంతు నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే..!

జలుబు, దగ్గు సమయంలో గొంతు నొప్పి అందరినీ ఇబ్బంది పెట్టే సమస్యే.. దీని నుంచి ఉపశమనం పొందాలంటే..

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆ నీటిని పుక్కిలిస్తే బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది. 

తేనె, నిమ్మకాయ నీటితో గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. 

అల్లం టీని తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో ఇది గొంతు నొప్పి, మంట నుంచి రక్షిస్తుంది.

ఆవిరి పీల్చడం వల్ల కూడా గొంతు చికాకు తగ్గుతుంది. 

ఆపిల్ సైడర్ వెనిగర్, గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలించడం వల్ల సూక్ష్మక్రిములు తొలగి ఉపశమనం కలుగుతుంది.

ఈ సమయంలో వెజ్, నాన్ వెజ్ సూప్ ఏదైనా గొంతు నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది. 

చల్లని నీటికి బదులుగా రోజంతా గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల హైడ్రేట్‌గా ఉంటుంది.