ఇంట్లోని పదార్థాలతో మీ జుట్టు నిగనిగ మెరుస్తుందిలా

అవకాడోలో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె వేసి ఈ ప్యాక్‌ను తలకు రాసి 20 నిమిషాలపాటు ఉంచండి. తరువాత తల స్నానం చేయండి.

గుడ్డు పగులగొట్టి 1 టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ అందులో వేసి జుట్టుకు పట్టించండి. 15 నిమిషాలయ్యాక స్నానం చేయండి.

సగం కప్ యోగర్ట్‌లో  1 టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించండి. 20 నిమిషాల తరువాత స్నానం చేయండి.

అరటిపండ్లలో టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి 15 నిమిషాలయ్యాక స్నానం చేయండి. 

కప్పు పాలకు 3 టీస్పూన్ల తేనె కలపండి. జుట్టుకు రాసుకుని 20 నిమిషాలపాటు అలాగే ఉంచండి. తరువాత స్నానం చేస్తే నిగనిగలాడే జుట్టు మీ సొంతమవుతుంది.