వేడి పాలు vs చల్లని పాలు: ఏవి ఆరోగ్యానికి మంచివి?

పాలలో ఎన్నో మిటమిన్లు, పోషకాలు ఉంటాయి. శరీరంలోని ఎముకల పుష్టికి అవసరమయ్యే కాల్షియం పాల నుంచే అందుతుంది. 

మన దైనందిన జీవితంలో పాలు ఇచ్చే శక్తి తక్కువది కాదు. మరి, ఆరోగ్యం కోసం వేడి పాలు తాగాలా? చల్లని పాలు తాగాలా? 

వేడి పాలు తాగడం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. శరీర భాగాల్లోని నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. 

ఉదయాన్నే చల్లని పాలు తాగితే గుండె మంట తగ్గుతుంది. అలాగే కడుపులోని అల్సర్లు తగ్గుతాయి.

వేడి పాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయులను క్రమబద్ధీకరించగలవు. దంత సమస్యలను నివారిస్తాయి.

చల్లని పాలలో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డీ హైడ్రేషన్ సమస్య నుంచి కాపాడతాయి.

జ్వరం, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలకు వేడి పాలు మంచి ఔషధం. ఇవి యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. 

చల్లని పాలు తాగిన తర్వాత ఆకలి త్వరగా వేయదు. కాబట్టి బరువు నియంత్రణలో ఉంటుంది. 

వేడి, చల్లని పాలు రెండూ వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రోజులో పగటి పూట చల్లని పాలు, సాయంత్రం, రాత్రి వేళల్లో వేడి పాలు తాగితే మంచిది.