హోలీ రోజున తండై తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే...!
శీతలీకరణ లక్షణాలు.. తాండై గులాబీ రేకులు, కుంకుమపువ్వు, సోపు గింజలు వంటి పదార్ధాలు కలిగి ఉంటాయి. ఇవి వేడి వాతావరణంలో శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది.
సాంప్రదాయ తాండై వంటలలో నల్ల మిరియాలు, ఏలకులు, సోపు గింజలు వంటి సుగంధ ద్రవ్యాలను చేర్చుతారు. ముఖ్యంగా పండుగ ఆహారన్ని తీసుకున్న తర్వాత అలసటను తగ్గించేందుకు దీనిని తీసుకుంటారు.
తండై తరచుగా గసగసాలు, బాదం వంటి పదార్థాలను కలిపి చేస్తారు. వీటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి శక్తిని పెంచే పోషకాలు అధికంగా ఉంటాయి.
హైడ్రేషన్‌గా ఉంచే తాండైని ప్రధానంగా పాలతో తయారుచేస్తారు. ఇది పండుగల సమయంలో ముఖ్యంగా శరీరాన్ని వేడి నుంచి కాపాడుతుంది.
తాండైలోని కుంకుమపువ్వు, బాదం వంటి కొన్ని పదార్ధాలతో పాటు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహకరిస్తాయి.
ఎముక ఆరోగ్యాన్ని పాలతో చేసిన తండై పెంచుతుంది. ఇందులోని కాల్షియం, బలమైన ఎముకలకు అవసరం.
ఇందులో బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ, ఓట్స్ వంటి తృణధాన్యాలలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. కేలరీలు దట్టంగా ఉన్నఅవకాడో రుచికోసం తాండైలో ఉపయోగిస్తారు.
ఇది రోజంతా ఎనర్జీ లెవల్స్‌ను అందిస్తూనే ఉంటుంది. కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది.