షుగర్ ఉన్నవారు బంగాళాదుంపను ఎలా తీసుకోవచ్చు..!

కొన్ని ఆహారాలు షుగర్ ఉన్న వ్యక్తులు తినడం వల్ల ఇబ్బందులు తప్పవు. చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. 

బంగాళాదుంపలు అధిక గ్లైసెమిక్ కలిగి ఉంటాయి. వీటిని షుగర్ వ్యక్తులు మితంగా తీసుకోవడం మంచిది. అదీ ఎలాగంటే

ఉడికించిన బంగాళాదుంపలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల నిరోధక స్టార్చ్ పెరుగుతుంది. 

బంగాళాదుంపలకు వెనిగర్, ముఖ్యంగా మాల్ట్ వెనిగర్ కలిపి తీసుకుంటే వీటిలోని గ్లైసెమిక్ తగ్గుతుంది. 

బంగాళాదుంపలతో పాటు కూరగాయలలోని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెరలు తగ్గిస్తుంది. 

ఉడికించిన బంగాళాదుంపలలో పోషకాలు, ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

బంగాళా దుంపలను వేయించడం కంటే ఉడికించి మాత్రమే తీసుకోవడం మంచిది. ఇది షుగర్ ఉన్నవారికి ఆరోగ్యకరమైన ఆహారం.

మరీ ఎక్కువగా వేయించడం వల్ల కొవ్వులు, కేలరీలు అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి.