కల్తీ వంట నూనెను ఇలా గుర్తించండి

ఏ వంట చేయాలన్నా ముందుగా కావాల్సింది నూనెనే

అలాంటి నూనెను ఇటివల కల్తీ చేసి బ్రాండ్ పేర్లతో అమ్ముతున్నారు

ఈ నేపథ్యంలో అసలు నూనెను కొన్ని చిట్కాలతో ఎలా గుర్తించాలో ఇప్పుడు చుద్దాం

నూనెను ఒక పాత్రలో కొంచెం వేసి ఫ్రిజ్‌లో కొన్ని గంటలు ఉంచితే నూనె ఉపరితలంపై తెల్లటి పొర వస్తే అది నకిలీది

నూనెను కొంచెం తీసుకుని దానికి కొన్ని చుక్కల నైట్రిక్‌ యాసిడ్‌ కలిపితే నూనె రంగు మారితే ఫేక్ నూనె

అరచేతిలో కొన్ని చుక్కల నూనె తీసుకుని గట్టిగా రుద్దాలి. అలా చేస్తున్న క్రమంలో రంగు మారి, వాసన బయటకు వస్తే అది కల్తీది

మీరు కొనుగోలు చేసే నూనె మార్కెట్ ధర కంటే తక్కువగా ఉంటే కల్తీ అయ్యే ఛాన్స్ ఉంది

తెల్ల కాగితంపై కొద్దిగా నూనెను వేస్తే అది స్వచ్ఛమైతే వృత్తంలా వ్యాపిస్తుంది, నకిలీదయితే ప్రవహిస్తుంది

ఆవ నూనె స్వచ్ఛతను తెలుసుకోవాలంటే నాలుకపై కొంచెం వేసుకొని రుచి చూడాలి. ఇది నల్ల మిరియాల మాదిరిగా ఉంటుంది

అలా కాకుండా చేదుగా ఉంటే మాత్రం అది నకిలీదని గుర్తించాలి