21 రోజుల్లో పొట్ట తగ్గించుకోవడం ఎలా?.. మాధవన్ చెప్పిన సీక్రెట్ ఏంటంటే..

``రాకెట్రీ`` సినిమా కోసం బాగా బరువు పెరిగిన మాధవన్ తన పూర్వపు ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించాడు. 

కేవలం 21 రోజుల్లో కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మాధవన్ బరువు తగ్గాడు. వాటిని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. 

మీ నోటికి చేరిన ఆహారాన్ని 45-60 సార్లు బాగా నమిలిన తర్వాతే మింగాలి. చాలా నెమ్మదిగా తినాలి. 

సాయంత్రం 6:45 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోకూడదు. 

మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉడకబెట్టిన, వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. పచ్చిగా ఉండే పళ్లతో సహా వేటినీ తీసుకోకూడదు. 

ఉదయాన్నే 10 వేల అడుగులు పూర్తి చేయాలి. రాత్రి 8 గంటలకల్లా నిద్రపోవాలి. 

మాంసాహారానికి దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను మాత్రమే తినాలి. నీళ్లు ఎక్కువ తాగాలి. 

మీ శరీరానికి పడని ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. తింటున్నప్పుడు ఆహారం పైనే శ్రద్ధ పెట్టాలి.