గోంగూర రొయ్యల కర్రీ - ఇలా చేస్తే సూపర్ టేస్ట్

 కావాల్సిన పదార్ధాలు : రొయ్యలు- పావు కిలో, నూనె- ఉప్పు - దాల్చిన చెక్క - లవంగాలు- యాలకులు-బిర్యానీ ఆకు జీలకర్ర- కరివేపాకు -పచ్చిమిర్చి -ఉల్లిపాయలు-అల్లం టమాట- పసుపు- టీస్పూన్‌ కారం-

స్టవ్​ ఆన్​ చేసి పాన్‌ పెట్టి కొద్దిగా ఆయిల్‌ వేసి.. వేడెక్కాక పచ్చి రొయ్యలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి రొయ్యల్లో నీరు పోయేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.

 పాన్‌లో కొద్దిగా ఆయిల్‌ వేసి.. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

పచ్చి మిర్చి, కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చేంత వరకు ఫ్రై చేయండి.

అల్లం వెల్లుల్లి పేస్ట్‌, టమాటలను వేసి కలపండి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయించుకోవాలి.

నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మిశ్రమంలోకి బాగా కడిగిన గోంగూర రెబ్బలు వేసి 5 నిమిషాలు ఉడికించండి.

 రొయ్యలను వేసి, కొన్ని నీళ్లు యాడ్‌ చేసుకుని 10 - 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి.

 కర్రీని దింపేసే ముందు కొత్తిమీర తరుగు, కరివేపాకు, గరం మసాలా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కర్రీ రెడీ.