పుల్లగా, స్పైసీగా గోంగూర పులిహోర  ఇలా ట్రై చేయండి

కావాల్సిన పదార్థాలు: గోంగూర, అన్నం, చింత పండు, తాళింపు దినుసులు, జీడిపప్పు, పల్లీలు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, మెంతులు, నూనె, నెయ్యి.

ముందుగా అన్నాన్ని పొడి పొడిలాడేట్టు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 

 గోంగూరను వలిచి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. 

 ఇందులో కొద్దిగా మెంతులు, ఆవాలు వేసి చిన్న మంట మీద వేయించాలి

 కొన్ని ఎండు మిర్చి, కొద్దిగా ఇంగువ వేసి ఓ సారి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. 

 మిశ్రమం చల్లారక మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి

అదే  పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి… గోంగూర, ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకోవాలి.

అన్నంలో పొడి పొడిలాడే అన్నంలో కొద్దిగా గోంగూర మిశ్రమం, కొద్దిగా కొత్తిమీర కలిపి పక్కన పెట్టండి. 

 తాళింపు పెట్టుకుని అన్నంలో వేసి అంతా కలపాలి. చివరలో కొద్దిగా నెయ్యి వేసి కలపండి.

ఎంతో రుచిగా ఉండే గోంగూర పులిహోర సిద్ధం. ఈ రుచికే కడుపు నిండిపోతుంది.