b73930ea-798e-4323-a907-f7ed043cc27d-01.jpg

ఆలు బోండా ఇలా చేశారంటే  టేస్ట్ అదిరిపోవాల్సిందే..

029e4ced-15f3-4714-b108-bb7f1be24ef1-14.jpg

గిన్నెలో శెనగపిండిని వేసి అందులోనే బియ్యప్పిండి పసుపు, కారం, వాము, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి.

18194864-f2cc-49b2-85a1-35222e2e5935-16.jpg

ఈ మిశ్రమం పై మూత  పెట్టి పక్కన పెట్టాలి.

15d19adb-601e-4eb9-b44d-294adc5964c4-18.jpg

బంగాళదుంపలను ఉడకబెట్టి ఒక గిన్నెలో వేయాలి. వాటిని చేత్తోనే మెత్తగా మెదుపుకోవాలి.

మిక్సీ జార్ లో అల్లం వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

స్టవ్ మీద పెనం పెట్టుకుని వేడెక్కాక కాస్త నూనె వేసుకోవాలి.

నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.

మిక్సీలో రుబ్బుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేయించాలి.

నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, పసుపు, ఇంగువ వేసి కలుపుకోవాలి.

 రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. చివరగా ఆలుగడ్డ మిశ్రమాన్ని గట్టిపడే వరకు వేయించాలి.

తర్వాత ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చాలి. బంగాళదుంప స్టఫింగ్ కోసం రెడీ అయినట్టే.

బంగాళాదుంపలను చేతితో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

స్టవ్ మీద సరిపడా డిష్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి.

 బంగాళదుంప ఉండలను ముందుగా చేసుకున్న శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయించాలి.

ముదురు గోధుమ రంగులోకి మారాక బయటకు తీయాలి. రుచికరంగా ఆలూ బోండా రెడీ అయినట్టే.