బాదుషా తయారు చేయడం ఎలా...

ఒక గిన్నెలో మైదా తీసుకొని దానికి నెయ్యి, పెరుగు, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి.

 ఆ మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉండేలా కలపాలి

స్టవ్‌మీద పాన్‌ పెట్టి అర కప్పు నీళ్లు పోసి చక్కెర, కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి ముదురుపాకం పట్టాలి

 పిండిని మరోసారి బాగా మెదిపి చిన్న చిన్న ముద్దలు చేసుకుని మధ్యలో బొటనవేలితో నొక్కి బాదుషా చేసుకోవాలి.

తక్కువ మంటపై నూనెలో వేసి దోరగా వేయించాలి

ఆ తర్వాత చక్కెర పాకంలో వేయాలి.

పాకంలో వేసిన 5 నిమిషాలు తర్వాత తీస్తే.. నోరూరించే బాదుషా రెడీ.