బోటి కర్రీ ఇలా వండారంటే.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..

 బోటి కర్రీ వండటానికి కావాల్సిన పదార్థాలు

 బోటి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాట, కారం, పసుపు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, స్వీట్ ఆయిల్.

 బోటిని ముక్కలుగా చేసి వేడి నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి  

ముక్కల్లో కొద్దిగా పసుపు, ఉప్పు, నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఇలా చేస్తే బోటీ మొత్తం క్లీన్ అవుతుంది.

 తర్వాత బోటీ ముక్కలను వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

మిక్సీ తీసుకుని అందులో అల్లం, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. 

 తర్వాత కుక్కర్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు, ఉల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఉడికించి పక్కన పెట్టి బోటి ముక్కలు వేయాలి.

 5 నిమిషాలు ఫ్రై చేశాక, కారం, పసుపు, ఉప్పు, కొబ్బరి పొడి కొద్దిగా, ధనియాల పొడి, గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి.

  5 నిమిషాలు వేయించాక.. నీళ్లు వేసి గిన్నెలో వేసి లో ప్లేమ్ మీద ఉడికించా

  వేడి తగ్గాక మూత తీసి నీళ్లు ఉంటే దగ్గరబడనిచ్చాక కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బోటీ కర్రీ సిద్దం.