నిమిషాల్లో బ్రెడ్ ఆమ్లెట్‌ని సింపుల్‌గా
తయారు చేసుకోండిలా..
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గుడ్లు పగలగొట్టి వేయాలి.
గుడ్లలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిసేపు కలపాలి.
అనంతరం స్టవ్ మీద పెనం పెట్టి అందులో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కాస్త వేడి చేయండి.
పెనం వేడిగా అయ్యాక.. అప్పటికే కలిపిన గుడ్ల మిశ్రమాన్ని అందులో పోయండి.
గుడ్ల మిశ్రమం కొంచెం గట్టిగా అయ్యే వరకు వేడి చేయాలి.
తర్వాత ఆ మిశ్రమంపై బ్రెడ్ ముక్కలను ఉంచండి. అలా కాసేపు సన్నని మంట మీద ఉండనివ్వాలి.
బ్రెడ్ ముక్కలను తిప్పి మరోవైపు కాల్చాలి.
బ్రెడ్ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు సన్నని మంటపై వేయించాలి.
ఇలా చేస్తే నిమిషాల్లోనే రుచికరమైన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.
Related Web Stories
మీ ఇంట్లోనే శబరిమల అయ్యప్ప ప్రసాదం.. రెసిపీ ఇదే
ఇడ్లీలు మృదువుగా ఉండాలంటే ఈ ట్రిక్స్ ఫాలో కండి .!
ఇంటి ముందు ఈ చెట్లు ఉంటే.. నెగిటివ్ వైబ్రేషన్స్ పరార్..!
మగవారు గడ్డం పెంచితే ఇన్ని లాభాలా