ప్రెజర్ కుక్కర్‌లో చికెన్ బిర్యానీ.. ఇంత సింపులా..  

నోటికి ఏమీ తినాలనిపించనప్పుడు ఇలా ప్రెజర్ కుక్కర్ లో 5 సింపుల్ స్టెప్స్ లో ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ ఎవ్వరైనా చేసుకోవచ్చు.

కావలసినవి: అరకేజీ చికెన్, రెండు కప్పులు నానబెట్టిన బాస్మతి రైస్, 2 మీడియం సైజ్ టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చీల్చిన పచ్చిమిర్చి..

మసాలాలు: 2 చెంచాల బిర్యానీ మసాల, అరస్పూన్  పసుపు, స్పూన్ కారం, ఉప్పు, రెండించుల బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీ, పట్టా, సాజీరా, తరిగిన కొత్తిమీర, 3 చెంచాల నెయ్యి, రెండున్నర కప్పుల వాటర్

ప్రెజర్ కుక్కర్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. బంగారు వర్ణం రంగు వరకు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, చికెన్, బిర్యానీ మసాలా, టొమాటోలు వేసుకోవాలి.

ఐదు నిమిషాలు వేగాక నీటితో సహా బియ్యం వేసుకుని ఉప్పు సరిచూసుకోవాలి. బియ్యం విరగకుండా కలుపుకుని కొత్తిమీర చల్లి మూత పెట్టుకోవాలి. రెండు విజిల్స్ లో వేడి వేడి బిర్యానీ రెడీ.