కోకోనట్ కోవా బర్ఫీ.. ఈ స్వీట్ ఒక్కసారి  ట్రై చేసి చూడండి అస్సలు వదలరు..

కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము, పాలు, యాలకుల పొడి, పంచదార లేదా యాలకుల పొడి, కోవాల, కుంకుమ రేకులు, డ్రై ఫ్రూట్స్ తరుగు.

 ఈ స్వీట్ తయారీకి ముందుగా కొబ్బరి తురిమి తీసుకోవాలి. మరోవైపు స్టవ్ మీద పాలు పెట్టి మరిగించుకోవాలి.

 పాలు కాస్త చిక్కబడ్డాక బెల్లం పొడి లేదా పంచదార వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొబ్బరి తరుగు కూడా వేసి చిన్న మంట మీద ఉడికిస్తూ ఉండాలి.

ఇప్పుడు ఈ సమయంలో కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. వేస్తే బర్ఫీ మరింత రుచిగానే ఉంటుంది

ఆ తర్వాత యాలకుల పొడి కూడా వేసి అన్నీ కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి. చివరగా కోవా కూడా వేసి కలుపుకోవాలి

 కోవా వేయడం వల్ల ఈ స్వీట్ మరింత రుచిగా ఉంటుంది. ఇక మిశ్రమం బాగా దగ్గర పడ్డాక.. ఓ ప్లేట్‌కి నెయ్యి రాసి వేయాలి.

వేడిగా ఉన్నప్పుడే ముక్కలు కట్ చేయాలి. పైన డ్రై ఫ్రూట్స్ తరుగు చల్లుకోవాలి.

 ఓ గంట సేపు పక్కన పెడితే కోకోనట్ కోవా బర్ఫీ సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది.