ఇరానీ టీ ఇంట్లోనే  తయారు చేసుకోండిలా..

ముందుగా పాలను ఒక  పొంగు వచ్చే  వరకూ మరిగించాలి.

అనంతరం ఆ పాల  గిన్నెను పక్కన పెట్టుకోవాలి.

 తర్వాత మరో చిన్నపాత్రలో  రెండు గ్లాసుల నీళ్లు  పోసి వేడి చేయాలి.

కొంచెం మరిగాక యాలకులు,  అల్లం తురుము, లవంగాలు,  దాల్చిన చెక్క వేసి మరిగించాలి.

బాగా మరిగిన ఆ డికాషన్‌లో  టీ పొడి, చెక్కర వేసి మరో రెండు నిమిషాలపాటు వేడి చేయాలి.

 డికాషన్ బాగా కాగిన తర్వాత  అందులో మనం ముందుగానే వేడి  చేసి పెట్టుకున్న పాలను పోయాలి.

తర్వాత స్టవ్‌ను మీడియం  ఫ్లేమ్ పెట్టి ఐదు నిమిషాలపాటు  టీని బాగా కలపాలి.

అనంతరం ఆ వేడివేడి టీని  ఒక కప్పులో వడబోసి పోసుకుంటే  ఇరానీ టీ తయారైనట్లే..

ఇలా చేస్తే పెద్దపెద్ద హోటళ్ల  మాదిరిగా మంచి రుచికరమైన  ఇరానీ టీ ఇంట్లోనే సిద్ధం  అవుతుంది.