మైసూర్ పాక్.. స్వీట్ షాప్ టేస్ట్  రావాలంటే ఇలా చేయండి..!

కావలసిన పదార్థాలు: బెల్లం - 1 కప్పు (పొడిగా చేసుకోవాలి) బేసన్ - 1 కప్పునెయ్యి -  1 కప్పు ఏలకాయ పొడి - రుచికి తగినంత

నాన్-స్టిక్ పాన్ తీసుకొని, బెల్లం పొడిని వేసి కరిగించండి. పాకం ఒక తీగలాగా వచ్చే వరకు వండాలి.

 మరో పాన్‌లో బేసన్‌ను నెమ్మదిగా వేడి చేయండి. బేసన్ వాసన వచ్చి, లేత గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి. 

వేడి చేసిన బేసన్‌లో కరిగించిన బెల్లం పాకాన్ని నెమ్మదిగా వేసి కలపాలి. మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత, నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి

 మిశ్రమం నుంచి నెయ్యి వేరుగా తేలడం మొదలైతే, అప్పుడు వంటను ఆపివేయండి. 

చివరగా ఏలకాయ పొడి వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి, సమాన భాగాలుగా చేసి, మీకు నచ్చిన ఆకారంలో చేయండి

మైసూర్ పాక్‌ను పూర్తిగా చల్లబరచడానికి కొంత సమయం ఇవ్వండి.

గమనిక: అయితే, నెయ్యి, బెల్లం కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మితంగా తీసుకోవడం మంచిది.