ఇంట్లోనే మోతీచూర్ ల‌డ్డూ తయారీ..

శనగపిండి 2 కప్పులు; పాలు : లీటరు ; యాలకల పొడి : టీస్పూన్; నెయ్యి : మూడు కప్పులు; పిస్తా, బాదం పప్పులు పంచదార: 2 కప్పులు; నీరు : 3 కప్పులు : నెయ్యి : 3 కప్పులు

స్టెప్ 1 ఒక గిన్నెలో పంచదార, నీటిని వేసి పాకంగా మారేంత వరకు ఉడికించండి.

​స్టెప్ 2 ఇప్పుడు పాకంలో పాలను కలిపి పొంగు వచ్చిన తరువాత యాలకల పొడి వేయండి. ఇలా తయారు చేసిన పాకాన్ని ఓ పక్కన పెట్టుకోండి.

​స్టెప్ 3 ఇప్పుడు శనగపిండిలో బూందీ చేసుకునేంత విధంగా పాలను క‌లుపుకొని మిశ్ర‌మాన్ని త‌యారుచేసుకోండి.

స్టెప్ 4 పాన్‌లో నెయ్యిను పోసి వేడిచేసుకోండి. వేడెక్కిన నేతిలో శనగపిండి మిశ్రమాన్ని బూందీ రూపంలో జారవిడవండి. బంగారం రంగు వచ్చేంత వరకు బూందీ పలుకులను వేయించండి.

స్టెప్ 5 ఇప్పుడు త‌యారైన బూందీలో ముందుగా త‌యారుచేసిన పాకాన్ని క‌ల‌పండి.

 ​స్టెప్ 6 ఈ మిశ్రమంలో కొంచెం వేడి నీరు వేసి లడ్డూలుగా చుట్టండి.  మోతీచూర్ ల‌డ్డూ రెడి