స్వీట్ షాప్ లోని టేస్ట్ తో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా  నేతి మైసూర్ పాక్ తయారీ..

తయారీకి కావాల్సిన పదార్ధాలు: శనగపిండి – కప్పు పంచదార – కప్పు నెయ్య – కప్పు కంటే ఎక్కువ నీరు – అర కప్పు

ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి. అప్పుడు శనగ పిండిలో ఎటువంటి ఉండలు.. మొరం లేకుండా మొత్తగా వస్తుంది. దానిని మైసూర్ పాక్ తయారీకి తీసుకోవాలి. 

స్టవ్ మీద బాండీ పెట్టి వెలిగించి, సిమ్ లో పెట్టి ఈ శనగపిండి వేసి పచ్చి వాసన పోయి , కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించుకోవాలి.

వేగిన శనగపిండిని ఒక బౌల్ లోకి తీసుకుని. అందులో కరిగిన నెయ్య వేసి బాగా కలుపుతూ జారుగా ఉండలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. 

మళ్ళీ స్టవ్ మీద బాండీ పెట్టి సిమ్ ఫ్లేమ్ లో ఉంచి అరకప్పు నీళ్ళు పోసి .. కప్పు పంచదార వేసి కరగనివ్వాలి. 

అందులో శనగపిండి మిశ్రమాన్ని వేయాలి. తరవాత పంచదార పాకంలో వేసిన మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి. 

రెడీ అయ్యిన మైసూర్ పాక్ మిశ్రమాన్ని ఆ ప్లేట్ లో వేసుకుని.. ఎటువంటి బబుల్స్ లేకుండా సమానంగా సర్ధాలి.. కొంచెం సేపు అలా వదిలేస్తే.. చల్లారుతుంది. 

ఒక చాకు తో నచ్చిన షేప్స్ లో కట్ చేసుకుంటే మైసూర్ పాక్ రెడీ అవుతుంది.