చద్దన్నంతో టేస్టీ ప్యాన్‌కేక్..
తయారీ ఇలా
గిన్నెలో అన్నం, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తరుగు, ఉల్లికాడ తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి
అందులోనే గోధుమపిండి, శనగపిండి, పసుపు, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పెరుగు, ఉప్పు, కొత్తిమీర వేసుకుని మరోసారి కలపాలి
అనంతరం పావు కప్పు నీళ్లు పోసుకుని ముద్దలాగా కలుపుకోవాలి
ఈ మిశ్రమం చపాతీ పిండి కన్నా కాస్త మెత్తగానే ఉండాలి
పిండి మీద తడిగుడ్డ కప్పేసి కనీసం పావుగంట సేపు పక్కన ఉంచుకోవాలి
పిండిని సమాన భాగాలుగా చేసుకుని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి
ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి బాగా నూనె రాయాలి. తరువాత పిండి ఉండను కవర్‌పై పెట్టి చేత్తోనే వెడల్పుగా పరాటా సైజులో చేసుకోవాలి.
స్టవ్‌పైన పెనం పెట్టుకుని వేడెక్కాక కాస్త నూనె వేసుకుని ఈ ప్యాన్ కేక్ వేసుకోవాలి
ముదురు గోధుమ రంగులోకి మారాక బయటకు తీయాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే ప్యాన్ కేక్ రెడీ. చివర్లో కొత్తిమీరతో గార్నీషింగ్ చేసుకోండి.
Related Web Stories
అక్కడ పుట్టు మచ్చలు ఉంటే అదృష్టమేనట...
ఈ చిన్న టిప్స్ పాటించండి.. మీ లైఫ్‌కు పదేళ్లు యాడ్ చేసుకోండి..
చలికాలంలో చర్మసంరక్షణ కోసం ఎటువంటి ఆహారం తీసుకోవాలి..
రవ్వ బొబ్బట్లను ఇలా చేస్తే.. ఒక్కటి కూడా మిగల్చరు!