ఇంట్లో గణపతి పూజ ఎలా చేయాలి... పూజకు సామగ్రి ఏమిటంటే..?

భాద్రపద శుద్ద చవితి రోజు వినాయకుడు జన్మించాడు. అందుకే ఆ రోజునే వినాయక చవితి జరుపుకుంటారు.

ఈ ఏడాది వినాయక చవితి శనివారం వచ్చింది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ వచ్చింది. 

సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి

చవితి పూజ కోసం వినాయకుడిని పసుపు ముద్దుతో తయారు చేయాలి

వినాయకుడి విగ్రహాన్ని ఈశాన్య ప్రాంతంలో ప్రతిష్టించాలి.

పీట మీద బియ్యం పోసి.. పూర్ణకుంభంలో కొత్త బియ్యం వేసి.. వినాయకుడి విగ్రహం ముందు ఉంచాలి. 

మామిడాకులు, పూలు, పళ్లతోపాటు 21 రకాల పత్రాలను పూజ ప్రదేశంలో ఉంచాలి. 

నెయ్యితో చేసిన 12 రకాల వంటకాలను సిద్ధం చేసుకోవాలి. అందులోనూ గణపతికి ఎంతో ప్రీతి పాత్రమైన ఉండ్రాళ్లు, పాయసం తప్పని సరిగా ఉంచాలి. 

ఓం శ్రీ మహాగణాధిపతయే నమ: అని చెప్పి.. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే.. శ్లోకం చదివి గణపతి పూజను ప్రారంభించాలి.

పూజా పూర్తయిన అనంతరం మంగళహారతి పట్టుకొని దీపాన్ని గణపతికి చూపిస్తూ చరణాలు ఆలపించాలి.

చివరగా గణపతి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి భక్తులు సాష్ఠాంగ నమస్కారం చేయాలి.