వరలక్ష్మీ వ్రతం ఇలా
చేస్తే మీ ఇంట సిరుల పంట..!
శ్రావణమాసంలో
పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారు.
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి.
ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి.
మండపం పైన బియ్యపు
పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి.
పూజా మండపంలో
అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని సిద్ధం చేసుకోవాలి.
దారంతో తయారుచేసిన తోరాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలి..
అక్షతలు, పసుపు
గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.
వరలక్ష్మీవ్రతం సందర్భంగా మహిళలు తమ చేతికి తోరం కట్టుకోవాలి.
తోరం తయారుచేసుకోవడానికి తెల్లటి దారాన్ని ఐదు లేక
తొమ్మిది పోగులు తీసుకుని
పసుపు రాసుకోవాలి.
దారానికి ఐదు లేక తొమ్మిది
పూలు కట్టి ముడులు వేయాలి.
తోరాలను తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.
వరలక్ష్మీవ్రత కల్ప కథ చదువుకున్న తర్వాత చివరిగా కొబ్బరికాయ కొట్టి, హరతితో పూజను ముగించాలి.
Related Web Stories
నూడిల్స్ తినడం వల్ల వచ్చే అనారోగ్యాలు ఇవే..!
వరలక్ష్మీ వ్రతం ఆచరించేప్పుడు ఏ రంగు చీరను ధరించాలి..!
త్రివర్ణ పతాక రూపకర్త.. పింగళి వెంకయ్య గురించి ఈ నిజాలు తెలుసా..?
ఈ వంట నూనెలపై ఓ లుక్ వేయండి..!