హెల్దీ బ్రోకలీ, పాలకూర దోశ..  తయారు చేసుకోండి ఇలా..!

 ముందుగా బ్రోకలీని, పాలకూరను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 

మిక్సీలో బ్రోకలీ, పాలకూర, వెల్లుల్లి, పచ్చి మిర్చి, నీళ్లు వేసి పేస్టులా చేసుకోవాలి. 

 తరువాత ఉప్పు వేసి కలుపుకోవాలి. 

ఈ మిశ్రమంలో కొద్దిగా శనగ పిడి, జీలకర్ర, గరం మసాలా, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. 

 స్టవ్‌పైన పెనం పెట్టుకుని వేడెక్కాక కాస్త నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. 

ఈ పిండితో దోశలు వేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే హెల్దీ బ్రోకలీ, పాలకూర దోశ రెడీ..