టేక్ లెఫ్ట్..  ఎడమ వైపు పడుకుంటే  ఎన్ని లాభాలో తెలుసా? 

మన పొట్ట కింద ఎడమ వైపు భాగంలో ప్లీహం ఉంటుంది. ప్లీహంతో అన్ని శరీర భాగాలకు సంబంధం ఉంటుంది. ఎడమ వైపు పడుకుంటే ప్లీహంకు తగినంత రక్త సరఫరా జరుగుతుంది.

ఎడమ వైపు తిరిగి నిద్రపోవడం వల్ల గుండెకు కూడా రక్త సరఫరా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి నిద్రలో గుండె పోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

ఎడమ వైపు పడుక్కుంటే గుండె మంట, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే మలబద్దకం సమస్య కూడా దూరమవుతుంది.

గర్భిణులు ఎడమ వైపు తిరిగి పడుకుంటే చాలా మంచిది. గర్భాశయానికి, పిండానికి తగినంత రక్త సరఫరా జరుగుతుంది. బిడ్డ కదిలేందుకు వీలుగా కూడా ఉంటుంది.

భోజనం తర్వాత ఎడమ వైపు తిరిగి పడుకుంటే జీర్ణక్రియకు అవసరమైన ఎంజైములు త్వరగా విడుదలవుతాయి. ఫలితంగా తిన్నది చక్కగా అరుగుతుంది.

ఎడమ వైపు తిరిగి నిద్రపోతే కాలేయ పనితీరు మెరుగుపడుతుందట. అలాగే శరీరం నుంచి మలినాలను తొలగించడం సులభమవుతుంది.

ఎడమ వైపు తిరిగి పడుక్కోవడం వల్ల మెదడుకు కూడా రక్త సరఫరా మెరుగుపడుతుందట.

గురక, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎడమ వైపు తిరిగి పడుక్కుంటే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.