ఇలాంటి తప్పులు చేస్తేనే కిడ్నీల్లో రాళ్లు మళ్లీ మళ్లీ వస్తాయంట బీకేర్‌ఫుల్..
కిడ్నీలో రాళ్లు బాధాకరమైన సమస్య.. కాల్షియం, ఆక్సలేట్లు, యూరిక్ యాసిడ్, ఇతర మూలకాలకు సంబంధించిన స్ఫటికాలు మూత్రపిండాలలో పేరుకుపోయినప్పుడు ఇలా (కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం) జరుగుతుంది.
తగినంత నీరు త్రాగకపోతే, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.. ఇది చాలా తరచుగా జరగవచ్చు.
కొవ్వు, ఉప్పు, చక్కెర, అధిక ప్రొటీన్‌లు అధికంగా ఉండే ఆహారం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.
ముఖ్యంగా బచ్చలికూర, చాక్లెట్, మాంసాహారం వంటి ఆక్సలేట్లు, యూరిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల్లో రాళ్లను ప్రోత్సహిస్తాయి.
కుటుంబంలో ఎవరికైనా కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే, మీకు కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తుంది.