ఇలా చేస్తే చాలు ఇంట్లో  చీమలు దెబ్బకు కనిపించవ్..!!

నల్ల మిరియాల పొడి,  ఎర్ర కారం ఇవి రెండింటిలోనూ  ఘాటైన వాసన ఉంటుంది.  వంటగది మూలల్లో చల్లడం  వల్ల బాగా పనిచేస్తుంది.

పెప్పర్‌ మింట్ నీటిని  చల్లడం వల్ల చీమలు రావు.

ఇంట్లో పుదీనా మొక్కను  పెంచుకోవడం వల్ల చీమలు,  దోమలు, పురుగుల్లాంటివి  అటువైపు రావడం తగ్గుతాయి.

లెమన్‌, యూకలిప్టస్‌  ఆయిల్ కలిపి చిలకరించినా  చీమలు తగ్గుతాయి. 

ఉప్పు కూడా చీమల బెడదను  తగ్గిస్తుంది. చీమలు ఉన్న  ప్రదేశంలో ఉప్పును చల్లడం  వల్ల ప్రయోజనం ఉంటుంది.

దాల్చిన చెక్క, లవంగం  కలిపి చీమలు వచ్చే చోట  ఉంచాలి. దీనివల్ల చీమల  విషయంలో తగ్గే  అవకాశం ఉంటుంది.