జుట్టు పోషణలో ఈ ఇబ్బందులు లేకుంటే సరి..!

జుట్టు ఎదుగుదలకు చాలా రకాల ఉత్పత్తులను వాడుతుంటారు. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు నష్టాన్నే చేస్తాయి. 

శిరోజాల పోషణలో నూనె రాసినా, షాంపూ పెట్టినా కూడా చాలా గట్టిగా రుద్దుతూ ఉంటారు అలా చేయడం వల్ల జుట్టు ఎదుగుదల దెబ్బతింటుంది.

జుట్టు కుదుళ్లు బలంగా మారాలంటే కాస్త నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇది వెంట్రుకలు బలహీనమై రాలిపోకుండా చేస్తాయి.

కొందరు తడి జుట్టును దువ్వుతుంటారు. ఇలా చేయడం కూడా జుట్టుకు హాని చేస్తుంది.

జుట్టు బలహీనంగా మారుతుంది. 

హెయిర్ డ్ర‌య‌ర్ రోజూ వాడితే మాత్రం జుట్టు బ‌ల‌హీనంగా మారుతుంది. 

జుట్టును ఎల్ల‌ప్పుడూ లూజ్‌గా క‌ట్టుకోవాలి. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తే, జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది.