ఈ ఆహార చిట్కాలను ఫాలో అయితే వానాకాలం వ్యాధుల్ని ఆపవచ్చు...!
రుతుపవనాలు మండే వేడి నుంచి రిఫ్రెష్ చేస్తూ వానాకాలంలోకి తీసుకువచ్చినా ఆరోగ్య సమస్యలు కూడా అలాగే కూడా వస్తాయి.
ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులకు సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్, కలరా, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వనాకాలంలో పండ్లు, కూరగాయలు, తేమ పెరగడం వల్ల బ్యాక్టీరియా, పరాన్నజీవులకు సంతానోత్పత్తి కేంద్రాలుగా మారవచ్చు.
అన్ని పండ్లు, కూరగాయలను బాగా కడగాలి.
ఆకు కూరలను ఉప్పు నీటిలో లేదా వెనిగర్ ద్రావణంలో కొన్ని నిమిషాలు పాటు నానబెట్టి వాటిని శుభ్రం చేసుకోవాలి.
సరైన ఉష్టోగ్రత వద్ద ఆహారాన్ని వండటం వల్ల హానికరమైన బ్యాక్టీరియా, వ్యాధికారక క్రిములు నశిస్తాయి.
వానాకాలం కలుషిత నీరు కారణంగా నీటి ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. సురక్షితమైన నీటిని తాగాలి.
సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాల వ్యాప్తి చెందకుండా వంటగది శుభ్రంగా ఉండటం చాలా అవసరం.