ఈ పూలను వాడితే ముసలితనాన్ని
వాయిదా వేయొచ్చు..
ఆయుర్వేదం ప్రకారం ఈ పూలకు ఎంతో విలువ ఉంది. శంఖం పువ్వును ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన ఔషధంగా పరిగణిస్తారు. ఇది అనేక వ్యాధులకు చికిత్సలో వాడతారు.
ఈ పూలలో యాంటీఏజింగ్ లక్షణాలు ఎక్కువ. ఇది చర్మాన్ని ముసలితనం బారిన పడకుండా కాపాడతాయి. మీకు మెరిసే ఛాయను అందించడంలో ఈ పూలు ముందుంటాయి.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం, జుట్టు ఆరోగ్యానికి సహకరిస్తుంది.
శంఖం పూల టీని ప్రతిరోజూ తాగడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ముఖంపై గీతలు, ముడతలు పడవు.
ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గేందుకు మద్దతు ఇస్తాయి
ఇందులో విటమిన్ ఎ, సి, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మంపై పొరని కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.
శంఖం పూలతో తయారు చేసిన బ్లూ టీ తాగడం మొదలుపెట్టిన పదిహేను రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది.
Related Web Stories
వాయు కాలుష్యం ఎంత ఉంటే మానవులకు ప్రమాదకరం..
పురుషుల్లో టెస్టోస్టెరాన్ తగ్గడానికి గల 7 కారణాలివే..
ఆవు పాలను పచ్చిగా ఎందుకు తాగకూడదు..
కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి చాలు..