భయానక ప్రకృతి విపత్తుల్లో టోర్నాడోలు ముందుంటాయి. తీవ్ర వేగంతో సుడులు తిరిగే గాలులను టోర్నాడోలని అంటారు.

ఈ సుడిగాలులు మేఘాల నుంచి నేల వరకూ ఓ గొట్టం ఆకారంలో విస్తరించి కనిపిస్తాయి

టోర్నాడోల్లో గాలి గరిష్ఠంగా గంటకు 480 కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతుంది

వీటి ధాటికి భారీ ఇళ్లు కూడా పేకమేడల్లా గాల్లోకి ఎరిగిపోతాయి. వీటి వల్ల జరిగే ఆస్తినష్టం అపారం.

అమెరికాలోని టెక్సాస్, ఓక్లహోమా, కాన్సాస్, నెబ్రాస్కాల్లో టోర్నాడోలు సంభవిస్తుంటాయి.

టోర్నాడోల్లో కూడా వివిధ రకాలు ఉంటాయి. అవి ఎలా ఏర్పడ్డాయనే అంశంగా ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు

టోర్నాడోల తీవ్రతను ఫుజిటా స్కేల్ ద్వారా కొలుస్తాం. ఈఎఫ్ 0 తీవ్రతను అత్యల్పంగానూ ఈఎఫ్ 5 కేగటిరీని తీవ్ర టోర్నాడోగా పిలుస్తారు.