రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?

చాలా మంది చెమట పట్టకపోతే, స్నానం చేయవలసిన అవసరం లేదని అనుకుంటారు

అరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్నానం చేయడం వల్ల చర్మం నుంచి ఆరోగ్యకరమైన నూనెలు, బ్యాక్టీరియా తొలగిపోతుందట. 

 తరచుగా స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుందట. తద్వారా దురద, చర్మంపై పగుళ్లు ఏర్పడి.. పగిలిన చర్మం ద్వారా చెడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది

 అలాంటప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు వినియోగిస్తే.. మంచి బ్యాక్టీరియా నశిస్తుంది.

 అదనపు నూనెలు లేకుండా ఉండే తేలికపాటి సబ్బు, తేలికపాటి క్లెన్సర్, షవర్ జెల్ స్నానికి ఉపయోగించాలంటున్నారు నిపుణులు.

మురికిగా ఉండే టవల్ దురద, మొటిమలను కలిగిస్తుంది. దీన్ని నివారించడానికి, కనీసం వారానికి ఒకసారైనా మీ టవల్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి. అలాగే ఎండలో పూర్తిగా ఆరబెట్టాలి.