షుగర్ పేషెంట్లు టీ తాగితే ఏం జరుగుతుంది? 

చాలా మంది తరచుగా టీ తాగుతుంటారు. సాధారణ వ్యక్తులు టీ తాగినా పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ, షుగర్ పేషెంట్లు టీ ఎక్కువగా తాగవచ్చా?

టీ పౌడర్ వల్ల షుగర్ పేషెంట్లకు పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. అది బ్లడ్ షుగర్ స్థాయులపై ఎలాంటి ప్రభావమూ చూపదు. 

టీలో ఉండే పంచదార, పాలు మాత్రం అత్యంత ప్రమాదకరం. హెచ్చు స్థాయి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పంచదార క్షణాల్లో బ్లడ్ షుగర్ స్థాయులను పెంచేస్తుంది. 

సాధారణ పాలు ఎక్కువగా కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. వాటికి బదులు స్కిమ్డ్ మిల్క్ లేదా మొక్కల ఆధారిత పాలు చాలా ఉత్తమం. 

చాలా తక్కువ మోతాదులో పంచదార వేసుకుని పాలతో చేసే టీని షుగర్ వ్యాధిగ్రస్తులు రోజుకు ఒకసారి కంటే ఎక్కువగా తాగకూడదు

పంచదారకు బదులు సహజ స్వీటెనర్ అయిన స్టెవియాను టీలో కలుపుకుంటే బ్లడ్ షుగర్ స్థాయులు పెరగవు. 

పాలు, పంచదార లేకుండా గ్రీన్ టీ లేదా ఇతర హెర్బల్ టీలు తీసుకోవడం చాలా మెరుగైన ఫలితాలను అందిస్తుంది.