షుగర్ ఉన్న వాళ్లు నెయ్యి తింటే ఏం జరుగుతుంది..?

ఆవు పాల నుంచి తయారు చేసిన నెయ్యిలోని కొవ్వులు మెటబాలిజమ్‌ను మెరుగుపరుస్తాయి. డయాబెటిక్ మేనేజ్‌మెంట్‌కు ఎంతో ఉపయోగపడతాయి. 

నెయ్యిలో లినోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఈ లినోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరిన షుగర్స్‌ను బ్రేక్ చేసి కణాలు ఉపయోగించుకునేలా చేస్తుంది. 

రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. 

హై గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన అన్నం, బ్రెడ్‌తో పాటు నెయ్యి తీసుకోవడం ఎంతో ఉత్తమం. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన నెయ్యి రక్తంలోని చెక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. 

నెయ్యిలోని ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు అవసరమైన మంచి కొలస్ట్రాల్‌ను అందిస్తాయి. డయాబెటిక్ రోగులు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నెయ్యి తీసుకోవడం మంచిది.  

గట్ హార్మన్ల ఉత్పత్తిలో కూడా నెయ్యి సహాయపడుతుంది. గట్ ఆరోగ్యం మెరుగుపడితే షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. 

డయాబెటిక్ రోగులు ఎలాంటి సంకోచం లేకుండా నెయ్యి తీసుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా నెయ్యి మంచి ఉపయోగకారి.

నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు రక్తంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.