భారత్‌ గగన్‌యాన్‌ ప్రాజెక్టు కోసం ఇస్రో ‘అనలాగ్‌ మిషన్‌’ చేపట్టింది

కీలకమైన అనలాగ్‌ మిషన్‌కు ఇస్రో లద్దాఖ్‌లోని లేహ్‌ను వేదికగా ఎంచుకొంది

తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అంతరిక్ష యాత్రకు సంబంధించి చేపట్టే ఫీల్డ్‌ టెస్టులను అనలాగ్‌ మిషన్‌ అంటారు

దీనిలో ప్రభుత్వ ఏజెన్సీలు, విద్యాసంస్థలు కలిసి పనిచేసి తమ అంతరిక్ష యాత్ర సన్నద్ధతను విశ్లేషిస్తాయి

ఒక ప్రదేశంలో కొందరు వ్యక్తులు ఒంటరిగా ఉంటే వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను గుర్తించడం 

స్పేస్‌ రేడియేషన్‌ అంచనా వేయడం ఈ ప్రాజెక్ట్‌లో కీలకభాగం

భూమి నుంచి దూరం ప్రయాణించడంతో కమ్యూనికేషన్లు బలహీనపడతాయి

అలాంటి పరిస్థితులకు వ్యోమగాములను సిద్ధం చేయడం వంటి అంశాలు ఈ మిషన్‌లో భాగం

ఇస్రో, ఆకా స్పేస్‌ స్టూడియో, ది యూనివర్శిటీ ఆఫ్‌ లద్దాఖ్‌, ఐఐటీ బాంబే, 

లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఈ మిషన్‌ కోసం కలిసి పని చేస్తున్నాయి