హోలీ రంగుల నుండి మీ జుట్టుని, చర్మాన్ని ఇలా రక్షించుకోండి..!
జుట్టును పూర్తిగా కప్పి ఉంచడానికి కండువా, లేదా చున్నీ లాంటిది వాడండి. ఇది స్కాల్ఫ్ ని రంగులతో నిండిపోకుండా చేస్తుంది.
సూర్యుడి హానికర యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడానికి అధిక Spf ఉన్న వాటర్ ఫ్రూఫ్ సన్ స్క్రీన్ లోషన్ ముఖానికి పూయండి.
శరీరంలో ఎక్కువ భాగాన్ని కప్పి ఉంచే విధంగా దుస్తులను ధరించడం మంచిది.
ఇది చర్మం రంగును కాపాడడమే కాదు, చర్మం చికాకుగా మారుకుండా అలర్జీలు రాకుండా చేస్తుంది.
పువ్వులు, కూరగాలు లేదా సేంద్రీయ పదార్ధాలతో తయారు చేసిన సహజ మూలికా రంగులనే ఈ హోలీకి వాడండి.
సింథటిక్ రంగులతో పోలిస్తే ఈ రంగులు చర్మ అలెర్జీలను, చికాకును తగ్గిస్తాయి.
చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి శరీరం నుండి చెడును బయటకు పంపేందుకు హోలీ ఆడే ముందు పుష్కలంగా నీరు తాగండి.
హోలీ ఆడిన తర్వాత రంగులను సున్నితంగా తొలగించడానికి తేలికపాటి క్లెన్సర్ లేదా హెర్బల్ షాంపూతో చర్మం, జుట్టును కడిగేయండి.
శుభ్రపరిచిన తర్వాత తేమను తిరిగి పొందేందుకు చికాకును తగ్గించడానికి హైడ్రేటింగ్ లోషన్ లేదా క్రీమ్‌తో మాయిశ్చరైజ్ చేయండి.
డీప్ కండీషనింగ్ ద్వారా లేదా తేమ, పోషణ ద్వారా హెయిర్ మాస్క్‌ని ఉపయోగించండి. హోలీ తర్వాత జుట్టుకు అదనపు పోషణ అవసరం.
Related Web Stories
వేపాకు మంచిదే కానీ.. ఇలా తింటే మాత్రం ప్రమాదం!
హోలీ సందర్భంగా ఈ స్పెషల్ ఫుడ్స్.. ట్రై చేయండి
భాగస్వాములను తినేసే ఆడ జీవులు ఏవో తెలుసా...!
హోలీ రోజున తండై తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే... !