వానలో మేకప్ చెదరకుండా ఉండాలంటే.. ఇలా చేయండి సరిపోతుంది..!
మేకప్‌లో ఉపయోగించే ఉత్పత్తులు క్రీమ్ బేస్‌డ్ అయితే, వాటిని వీలైనంత పరిమితంగా వాడుకోవాలి.
మేకప్ బాగా బ్లెండ్ చేయడంతో పాటు, చెదిరిపోకుండా ఉండడం కోసం పౌడర్‌తో సెట్ చేసుకోవాలి. ఇలా మేకప్ వేసుకోగలిగితే ‘ఎయిర్ బ్రష్’ లుక్ సొంతమవుతుంది.
మేకప్ ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉండడం కోసం సెట్టింగ్ పౌడర్ వాడుకోవాలి.
మేకప్ పూర్తయిన తర్వాత పెద్ద బ్రష్ తీసుకుని ముఖం, మెడ మీద పరుచుకునేలా సెట్టింగ్ పౌడర్‌ను అద్దుకోవాలి.
లిప్‌స్టిక్ విషయానికి వస్తే వానా కాలంలో బోల్డ్ కలర్స్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. ఎరుపు, మెరూన్, బ్రౌన్ రంగులు వానాకాలంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
వాటర్ ప్రూఫ్ మస్కారా వానాకాలానికి అనువైనది. మస్కారా అప్లై చేసిన తర్వాత, లైట్‌గా పౌడర్ డస్టింగ్ చేసుకొని, రెండో కోట్ వేస్తే కనురెప్పలు చిక్కగా కనిపిస్తాయి.
ఈ కాలంలో వానాకాలం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. వీలైనంత తక్కువ మేకప్ వేసుకోవాలి. ఫౌండేషన్ తక్కువగా వాడుకోవాలి.