వణ్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకాణం కొన్ని జంతువులను పెంచుకోవడం నేరం. ప్రధానంగా 10 జంతువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యంత ప్రమాదకర కుక్కగా పేరుగాంచిన పిట్ బుల్ అనే రకం కుక్కల పెంపకంపై నిషేధం విధించారు.
స్వేచ్ఛగా తిరగాల్సిన ఏనుగులను ఇళ్ల వద్ద పెంచుకోవడం నేరంగా పరిగణించబడుతుంది.
అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్న అలుగులను పెంచుకోవడం చట్టరీత్యా నేరం.
వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కొన్ని రకాల తాబేళ్లను పెంచడం కూడా నేరమే.
కొన్ని రకాల చిలుక జాతులను పెంచడం కూడా నేరం కింద పరిగణించబడుతుంది.
సింహాలు, పులులు, చిరుతలను పెంచడం, ఇళ్ల వద్ద బంధించడం నేరం.
అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్న ఖడ్గమృగాలను పెంచుకోవడం కూడా నేరమే.
ఎలుగుబంట్లను పెంపుడు జంతువులుగా చేసుకోవడం చట్టవిరుద్ధం.
మానిటర్ బల్లులు కూడా అంతరించిపోతున్న జాబితాలో ఉన్నాయి. వీటిని పెంచడం నేరం.
మొసళ్లను పెంచుకోవడం కూడా చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది.