గంగమ్మ ఒడికి మహాగణపతి

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన గణపయ్య ఖైరతాబాద్ మహాగణపతి.

ఈ ఏడాది 70 అడుగులు ఎత్తులో సప్తముఖ మహాశక్తి రూపంలో దర్శనమిచ్చారు.

నవరాత్రులు భక్తుల పూజలందుకున్నాడు ఆ లంబోధరుడు.

మహాగణపతిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు.

ఈ తొమ్మిదిరోజులు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుడికి వచ్చిన ఆదాయం రూ. 1.10 కోట్లు

మంగళవారం నాగు మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యింది.