మేఘాల నుంచి ఎలక్ట్రాన్లు విడుదలయ్యే సమయంలో ఉరుములు, మెరుపులు పుడతాయి. వాటినే పిడుగులు అంటారు.
పిడుగులో దాదాపు 30కోట్ల వోల్టుల విద్యుత్ ఉంటుంది. అది మనిషిని అక్కడికక్కడే కాల్చి బూడిద చేయగలదు.
అలాంటి భయంకరమైన పిడుగులు పడే సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకపోవడం మంచిది.
ఒకవేళ ప్రయాణం చేస్తూ కారులో ఉండిపోతే అందులో నుంచి అస్సలు బయటకు రాకూడదు.
రైతులు పొలాల్లో ఉంటే భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి. చెట్లు, టవర్ల కిందకు వెళ్లకూడదు.
పిడుగులు పడేటప్పుడు సెల్‌ఫోన్, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వాడకూడదు.
రక్షణ లేని ప్రదేశాల్లో ఉంటే మోకాళ్లపై చేతులు, తలపెట్టి దగ్గరికి ముడుచుకుని కూర్చోవాలి.
నీటిలో తడవడం, స్నానం చేయడం, పాత్రలు కడగటం వంటి పనులు చేయకూడదు.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు ఆపేయాలి.
ప్రమాదవశాత్తూ పిడుగుపడి ఎవరికైనా తీవ్రగాయాలు అయితే వెంటనే వారికి ప్రథమ చికిత్స అందించాలి.
పిడుగుపడిన వారిని పట్టుకోవడం ద్వారా ఎలాంటి షాక్ కొట్టదు. అలాంటి అపోహలకు గురికావొద్దు.
Related Web Stories
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశంలో ఫేమస్ గణేష్ మండపాలు, దేవాలయాలివే
ప్రపంచంలోని ఈ దేశాల్లో అతి తక్కువ పని గంటలు
మనసారా నవ్వడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?