కుక్కలు ఆత్మహత్య చేసుకుంటాయా? ఈ ప్రశ్న చాలా మందికి ఆసక్తికరంగా ఉంటుంది.

సాధారణంగా ఆత్మహత్య అనేది మానవులకు సంబంధించిన విషయంగా భావిస్తారు.

అయితే కుక్కలు వంటి జంతువులు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాయో తెలుసా..

ఈ విషయానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

వాటిలో ఒకటి స్కాట్లాండ్‌లోని ఓవర్‌టౌన్ బ్రిడ్జ్ లేదా డాగ్ సూసైడ్ బ్రిడ్జికి సంబంధించింది.

చాలా ఏళ్లుగా అనేక కుక్కలు ఈ బ్రిడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాయి.

బ్రిడ్జి భౌగోళిక స్థితి, వాతావరణం వల్ల అవి ఇలా చేస్తున్నాయని కొందరు చెప్తున్నారు.

వాటి మానసిక స్థితి సరిగా లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయని మరికొందరు చెప్తున్నారు.

కుక్కల యజమానుల ప్రవర్తనే ఇందుకు కారణం అని ఇంకొందరు భావిస్తున్నారు.

నిజానికి ఏం జరుగుతుందో తెలియదు. ఈ ప్రాంత కుక్కలు సూసైడ్ చేసుకుంటున్నాయి.

దీనిపై నిజానిజాలు తేల్చేందుకు పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.