పెదాలు  పగులుతున్నాయా..!

 చలికాలంలో పెదాలు పొడిగామారి పగిలి రక్తమోడుతూ ఇబ్బంది పెడుతుంటాయి. 

 ఇంట్లో ఉండేవాటితోనే పెదాలను మృదువుగా ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.

నెయ్యి, వెన్న, కొబ్బరినూనె రాస్తుంటే పొడిబారకుండా ఉంటాయి.

పంచదార, తేనె, బాదం నూనె వేసి, బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పెదాలపై మృదువుగా రుద్దాలి. పెదాలపై మృత కణాలన్నీతొలగిపోయి రక్త ప్రసరణ జరిగి పగుళ్లు పోతాయి.

పొడిబారిన పెదాలను నాలుకతో మాటిమాటికి తడపకూడదు. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది

 గులాబీ రేకులను పాలలో నానబెట్టి, మెత్తగా నూరి, ఆ మిశ్రమాన్ని పెదాలకు పట్టిస్తే వాటికి తగినంత తేమ లభిస్తుంది.

కొత్తిమీర రసం, బీట్‌రూట్‌ రసం రాస్తుంటే పెదాలు సహజసిద్దంగానే ఎరుపు రంగులోకి మారతాయి.

ఒక చెంచా దానిమ్మ రసం కలిపి ఫ్రిజ్‌లో అరగంట ఉంచాలి. తరవాత ఆ మిశ్రమాన్ని పెదాలమీద మెల్లగా రుద్దాలి. అరగంట తరవాత మంచి నీళ్లతో కడగాలి. ఇలా తరచూ చేస్తుంటే పెదాలు మృదువుగా మారతాయి.