మద్యం ప్రియులకు పండుగలాంటి వార్త
కర్ణాటక తరహాలో తెలంగాణలో టెట్రా ప్యాకెట్లలో త్వరలోనే మద్యం అందుబాటులోకి రానుంది.
ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లను జేబులో పెట్టుకుని తీసుకెళ్లేలా ఎక్సైజ్ శాఖ అధికారులు తయారు చేస్తున్నారు.
60 ఎంఎల్, 90 ఎంఎల్, 180 ఎంఎల్‌ల ప్యాకెట్లను అమ్మడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు.
సీసాలో దొరుకుతున్న మద్యం కంటే.. టెట్రా ప్యాకెట్లలో తక్కువ ధరకు మద్యం లభించనుంది.
తెలంగాణలో ఇప్పుడు క్వార్టర్ చీఫ్ లిక్కర్ ధర రూ.120గా ఉంది.
అదే మద్యం టెట్రా ప్యాకెట్లలోకి మారితే రూ.100లకు లభించే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు.
ప్రభుత్వ ఆమోదం తర్వాత రాష్ట్రంలో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు జరుగనున్నాయి.
కర్ణాటకలో మెక్‌డొవెల్స్ నంబర్ వన్ అనే కంపెనీ 90శాతం టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు జరుపుతోంది.
క్వార్టర్ సీసాల్లో విక్రయాలు తగ్గడం, ప్యాకెట్ల విధానం కొత్తగా తీసుకురావడం వల్ల అమ్మకాలు పెరుగుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు అంటున్నారు.
ప్రస్తుతం సరఫరా చేస్తున్న క్వార్టర్ బాటిల్స్ స్థానంలో టెట్రా ప్యాకెట్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు.
కర్ణాటక సరిహద్దులోని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
Related Web Stories
ఆంధ్రా స్పెషల్ ఆవ పెట్టిన పనస పొట్టు కూర మీకు తెలుసా
సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర..
ఈ లక్షణాలుంటే మీ కుక్క డిప్రెషన్లో ఉన్నట్టే
బీర్లలో రకాలు ఎన్నో... అవి ఏంటంటే..