పిల్లల్ని కనడం ఏ జీవికైనా కష్టమే. కొన్ని జంతువులు అయితే పిల్లల్ని కన్న తరువాత మరణిస్తాయి. అవేంటంటే..
ప్రేయింగ్ మాంటిస్ అనే గొల్లభామ జాతికి చెందిన పురుగు గుడ్లు పెట్టాక కన్నుమూస్తుంది
గుడ్లు పెట్టేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లే సాల్మన్ చేప ఆ తరువాత అలసిపోయి మరణిస్తుంది
సోషల్ స్పైడర్స్ అనే సాలెపరుగులు కూడా గుడ్లు పెట్టాక చనిపోతాయి.
జీవితంలో ఒక్కాసారి మాత్రమే ఆక్టోపస్‌లు పిల్లల్ని కంటాయి. గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చాక తల్లి ఆక్టోపస్ అలసటతో మరణిస్తుంది.
కొన్ని రకాల తేళ్లు కూడా పిల్లల్ని కన్నాక తిండి మాని చనిపోతాయి. బిడ్డలకు ఆహారంగా మారేందుకు ఇలా చేస్తాయి.
తూనీగ జాతికి చెందిన మేఫ్లైస్ అనే పురుగులు కూడా గుడ్లు పెట్టాక కన్నుమూస్తాయి
ఎలక జాతికి చెందిన ఆంటీచీనస్ మగ జీవులు ఆడ జీవులతో పలుమార్లు కలిసి, చివరకు అలసటతో మరణిస్తాయి.
Related Web Stories
భూమిపై ఉండే 8 అతిపెద్ద చెట్లు ఇవీ..!
ప్రపంచంలోనే మొట్టమొదటి బంగారంతో నిర్మించబడిన హోటల్ .. ఇందులో అద్దె ఎంతంటే..!
ఒక్క స్పూన్ బాదం నూనె తాగండి.. మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోండి!
సమ్మర్లో కరెంట్ బిల్లు తగ్గించే చిట్కాలు!