లోకకల్యాణం కోసం శ్రమించే పరమేశ్వరుడు పరమదయాళువు.

అందుకే, శివనామస్మరణతో మనసుకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. 

పంచాక్షరీ మంత్రం జపించిన వారికి శివానుగ్రహం లభిస్తుంది

మహా మృత్యుంజయ మంత్రం జపించిన వారికి సమస్త భయాలు తొలగిపోతాయి

శివగాయత్రీ మంత్రం జపిస్తే మేధోశక్తి, పరమేశ్వరుడిపై భక్తి ఇనుమడిస్తుంది

రుద్రమంత్రం జపిస్తే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మానసిక దృఢత్వం కలుగుతుంది

శివధ్యాన మంత్రంతో ధ్యాన సమయంలో మనసు పరమేశ్వరుడిపై సులువుగా లగ్నమవుతుంది.