రోజూ వారీ కార్యకలాపాల్లో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుంది. అవేంటో తెలుసుకుందాం. 

కొంతమంది ఎక్కువగా నోటితో గాలి పీల్చుకుంటారు. ఇలా చేయడం అనారోగ్యానికి దారి తీస్తుంది. 

కొంతమంది ఎక్కువగా నోటితో గాలి పీల్చుకుంటారు. ఇలా చేయడం అనారోగ్యానికి దారి తీస్తుంది. 

ముక్కుతో గాలి పీల్చడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. 

నెమ్మదిగా, గాఢంగా శ్వాస తీసుకోవాలి. ఇలా చేస్తే గుండె కొట్టుకునే వేగం తగ్గడంతో పాటూ రక్తనాళాలు ఉత్తేజమవుతాయి. 

రోజూ కనీసం అర గంట సేపు అయినా నడక ఉండాలి. లయబద్ధంగా అడుగులు వేయడం వల్ల నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. 

సాయంత్ర సమయంలో విశ్రాంతి అవసరం. కళ్లు మూసుకుని ఏకాగ్రతలో ఓదో ఒక విషయంపై దృష్టి నిలపాలి. 

కుర్చీలో కూర్చునే పద్ధతి సక్రమంగా ఉండాలి. అలాగే గంటల గంటలు కూర్చోవడం కూడా అనారోగ్యానికి దారి తీస్తుంది. 

సమాయానికి భోజనం చేయాలి. నెమ్మదిగా నములుతూ భోజనం చేయాలి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా అనారోగ్యం తలెత్తిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.